నిడదవోలు జనసేన ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ల పరిశీలన

తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం కె సావరం, పాలంగి, ఉండ్రాజవరం గ్రామాలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీలను ఉండ్రాజవరం మండల అధ్యక్షులు వీరమల్ల బాలాజీ ఆధ్వర్యంలో జనసేన నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే నెపంతో వైసిపి నాయకులు కోట్ల రూపాయలు దండుకున్నారని, స్థలం ఇవ్వడానికి ఒక్కో గ్రామంలో ఒక్కో రేటు ఫిక్స్ చేశారని, లబ్ధిదారుల నుండి 30 వేల నుండి 1,65,000 వరకు వసూలు చేశారని అన్నారు. ఒక్క కె సావరం గ్రామంలోనే అత్యధికంగా లక్షా 65 వేల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారులు మాట్లాడుతూ ఉండ్రాజవరం మండలం కె.సావరం గ్రామంలో నాకు జగనన్న కాలనీలో ఆరో నెంబర్ ఫ్లాట్ మంజూరు అయిందని ఆ స్థలానికి గాను నన్ను లక్షా 65 వేల రూపాయలు కట్టవలసిందిగా నాపై వైసీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారని లక్షా 65 వేల రూపాయలు కట్టే స్తోమత నాది కాదు అని చెప్పడంతో లక్షా 65 వేల రూపాయలు కట్టిన పిదపే ఇళ్ల పట్టా తీసుకోమని, ఇళ్ల పట్టా వారి దగ్గరే ఉంచుకున్నారని అంతే కాకుండా నాతో నా భార్యతో మా గ్రామ వైసీపీ నాయకులు ఖాళీ పేపర్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకున్నారని,ఇవి లక్ష 65 వేల రూపాయలకు పూచికత్ అని చెప్పారని, డబ్బులు ఇచ్చి పట్టా తీసుకు వెళ్ళమని పదేపదే ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. ఇద్దరు పిల్లలతో సెలూన్ షాప్ నడుపుకునే నేను లక్ష అరవై వేల రూపాయలు కట్టడం గగనమేనని కావున అధికారులు స్పందించి మాలాంటి పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.