Vizag: జోరందుకున్న ప్రచారం – గెలుపు దిశగా శ్రీమతి ములంపాక నాగవేణి

విశాఖ జిల్లా, పశ్చిమ నియోజకవర్గం, 61వ వార్డులో ఉపఎన్నికకు జోరందుకున్న జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి ములంపాక నాగవేణి ప్రచారం. ఈ ప్రచారంలో ఒక్క రూపాయి కూడా పంచకుండా నియోజకవర్గం మొత్తం కదిలింది. శ్రీమతి ములంపాక నాగవేణి మొత్తం నియోజకవర్గం ప్రచార కార్యక్రమంలో ఊపందించి అభ్యర్థినికి అండగా నిలిచిఇంది. ప్రచారంలో ప్రజలు అడుగడుగునా శ్రీమతి ములంపాక నాగవేణికి నిరాజనాలు పట్టారు. ప్రచారంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బైకు ర్యాలి నిర్వహించారు. ప్రచారంలో శ్రీమతి ములంపాక నాగవేణికి లభించిన జనాదరణ చూసి జనసేన నాయకులు తమ అభ్యర్ధి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారంలో జనసేన రాష్త్ర జనసేన నాయకులు, నియోజకవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.