అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

విజయనగరం: అంతర్జాతీయ యోగా దినోత్సవం, జూన్ 21న, మంగళవారం పురస్కరించుకొని అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కలెక్టరేట్ కూడలిలో ఉన్న రెడ్ క్రాస్ యోగా కేంద్రంలో యోగ దినోత్సవాన్ని నిర్వహించారు.

ముందుగా యోగా గురువు ఆరి సుందర శివరావు యోగాయొక్క విశిష్టతను సభ్యులందరికి వివరిస్తూ అయన మాట్లాడుతూ క్రీస్తు పూర్వం రెండువందల సంవత్సరాల క్రితం పతంజలి రచించిన యోగ నేడు విశ్వజనీనమై ప్రపంచంలో సుమారు 180 దేశాలకు పైగా యోగ వినియోగప్రక్రియ వెలుగొందుతుందని, కరోనా సంక్షోభ కాలంలో యోగా ప్రముఖ్యతను ప్రపంచదేశాలు గుర్తించాయని, యోగాలో ప్రాణామాయ ప్రక్రియ మనిషిలో రోగనిరోధక కణాలను పెంచి, రక్తప్రసరణ బాగాజరిగి, ఊపిరితిత్తులు బలోపేతమై ఆరోగ్యంగా జీవిస్తారని తెలిపారు. ఇలాంటి మన ప్రాచీయ ప్రక్రియకు నేడు ప్రపంచ దేశాలు ప్రణమిళ్లుతున్న ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.

అనంతరం సభ్యులందరికి యోగాసనాలు వేసి, వేయించి ఆసనాలపై అవగాహన కల్పించారు.చివరగా యోగా గురువు సుందర శివరావు కు క్లబ్ సభ్యులంతా సత్కరించారు.

అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాకర్స్ పెద్దలు ఆదాడ మోహనరావు, క్లబ్ సహకార్యదర్శి కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, సభ్యులు కందివలస సురేష్, రవి, రాము, రాజు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-06-20-at-3.50.30-PM-1-1024x515.jpeg