జనసేన – తెలుగుదేశం ఆత్మీయ సమావేశం

కుప్పం నియోజకవర్గం: జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, మరియు తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గం ఇన్చార్జి మునిరత్నం నాయుడు, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ కంచన శ్రీకాంత్, డా. సురేష్ ఆధ్వర్యాన సోమవారం కుప్పం నియోజకవర్గంలో జనసేన – తెలుగుదేశం ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులతో పాటు జనసేన పార్టీ కుప్పం నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సభ్యులు నరేష్, రాష్ట్ర మశ్చికార కమిటీ సభ్యులు వామనమూర్తి, జనసేన చిత్తూరు జిల్లా కమిటీ సభ్యులు, రామమూర్తి, వేణు, మునెప్ప, నవీన్, ఐటి కోఆర్డినేటర్ మధు, మండల అధ్యక్షులు, కిషోర్, హరీశ్, సుధాకర్, అమీర్, ప్రవీణ్ మరియు మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.