చెల్లని పోస్టల్‌ బ్యాలెట్‌

ఎన్నికల విధుల్లో ఉండే అధికార, ఉద్యోగ సిబ్బంది సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ లో తిరస్కరణకు గురైన ఓట్లను గమనిస్తే, పోస్టల్‌ బ్యాలెట్‌పై ఉద్యోగులకు అవగాహన కొరవడినట్లయింది. ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పది డివిజన్‌లలో మొత్తం 137 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలవగా, వాటిల్లో 48 తిరస్కరణకు గురికావడం గమనార్హం. కాగా కాప్రా డివిజన్‌లో నాలుగు, ఎ.ఎ్‌స.రావు నగర్‌లో ఏడు, చర్లపల్లి డివిజన్‌లో ఐదు, మల్లాపూర్‌లో ఏడు, నాచారంలో ఆరు ఓట్లు తిరస్కరణకు గురవగా, ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని చిల్కానగర్‌లో ఐదు, హబ్సిగూడలో మూడు, రామంతాపూర్‌లో ఒకటి, ఉప్పల్‌లో అత్యధికంగా పది ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.