ఐపీఎల్ 2020: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

ఐపీఎల్-13 2020లో భాగంగా 7 మ్యాచ్ ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌,చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య దుబాయ్ వేదికగా బిగ్ ఫైట్ జరుగుతోంది. లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇది రెండో మ్యాచ్. పంజాబ్‌తో తొలి మ్యాచ్ ఆడిన ఢిల్లీ ఆ మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్లో క్యాపిటల్స్ విజయాన్ని దక్కించుకుంది. సెకండ్‌ ఫైట్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది. ఇప్పటికే చెన్నై ఈ సీజన్‌ ఫస్ట్‌ మ్యాచ్‌లో ముంబైతో గెలిచి.. రెండో మ్యాచ్‌లో 217 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక రాజస్థాన్‌ చేతిలో ఓటమిపాలైంది. అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోన్న ఢిల్లీ, వీటిల్లో ఎంతో అనుభవం ఉన్న చెన్నై నుంచి సవాల్‌ ఎదురుకానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లూ కూడా పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.