IPL 2021: మిగిలిన మ్యాచ్‌లన్ని ఒకే స్టేడియంలో..?

ఐపీఎల్‌ ను కరోనా కేసులు వణికిస్తుండటంతో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ఒకే స్టేడియంలో నిర్వహించాలని భావిస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌లో ఇద్దరు ప్లేయర్స్ కరోనా బారిన పడటం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ప్లేయర్స్‌ను అటూఇటూ తిప్పడం సరి కాదని బోర్డు భావిస్తోంది. మిగిలిన మ్యాచ్‌లను ముంబైలో నిర్వహించే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. లీగ్‌ను ముంబైకి తరలించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం బీసీసీఐ ఎదురు చూస్తున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కూడా వెల్లడించింది. దీంతో బుధవారం ఢిల్లీలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా అనుమానంగానే మారింది. ఇప్పటికే చెన్నై టీమ్ సిబ్బందిలో ఒకడైన బాలాజీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

ముంబై నగరంలో ఎలాగూ మూడు స్టేడియాలు ఉన్నాయి కాబట్టి.. అక్కడైతే మ్యాచ్‌ల నిర్వహణకు అడ్డంకి ఉండదని బోర్డు భావిస్తున్నట్లు ఆ రిపోర్టు తెలిపింది. ఇప్పటికే ముంబైలోని హోటళ్లతోనూ బీసీసీఐ అధికారులు మాట్లాడారు. 8 టీమ్స్‌కు బయో బబుల్ ఏర్పాటు చేయాల్సిందిగా వాళ్లు కోరారు. ఒకవేళ బోర్డు ఇదే నిర్ణయంతో బీసీసీఐ ముందుకు వెళ్లాలని భావిస్తే కోల్‌కతా, బెంగళూరులలో జరగాల్సిన మ్యాచ్‌లు రద్దవుతాయి.

లీగ్‌ను ముంబైకి తరలించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం బీసీసీఐ ఎదురు చూస్తున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కూడా వెల్లడించింది. దీంతో బుధవారం ఢిల్లీలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా అనుమానంగానే మారింది. ఇప్పటికే చెన్నై టీమ్ సిబ్బందిలో ఒకడైన బాలాజీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే