RCB Vs RR: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆర్‌సీబీ

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆర్‌సీబీ, రాజస్తాన్‌ రాయల్స్‌ ముంబై వేదికగా తలపడుతున్నాయి. హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీదున్న ఆర్‌సీబీని రాయల్స్‌ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి. కాగా ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్‌సీబీ.. రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తాజా సీజన్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ అన్నింటిలోనూ విజయం సాధించగా.. రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడి ఒకదానిలో మాత్రమేగెలిచింది.