పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళే అన్నింటికీ కారణమా??

మదనపల్లి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై సామర్లకోట
బహిరింగ సభలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను మదనపల్లి నాయకులు తీవ్రంగా ఖండించారు. శనివారం ఆరు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్లు చేసుకోకపోయింటే పాపం.. ఈపాటికి హంద్రీనీవా పూర్తి చేసేవారా?? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్లు చేసుకోకపోయింటే పాపం.. ఈపాటికి ఏ పికి ప్రత్యేక హోదా వచ్చేదా?? పవన్ 3 పెళ్ళిళ్లు చేసుకోకపోయింటే పాపం… ఈపాటికి ఏపి అభివృద్ధి పథంలో ఉండేదా?? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్లు చేసుకోకపోయింటే పాపం… ఈపాటికి ఏపిలో మద్యం తీసేసి వుండేవాళ్ళమా?? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్లు చేసుకోకపోయింటే పాపం… ఈపాటికి సీ.పీ.ఎస్ రద్దు అయ్యేదా?? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్లు చేసుకోకపోయింటే పాపం… ఈపాటికి 36 కేసులు కొట్టేసుకుందుమా?? పవన్ 3 పెళ్ళిళ్లు చేసుకోకపోయింటే పాపం… ఈపాటికి పోలవరం పూర్తి అయ్యేది కదా.. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్లు చేసుకోకపోయింటే పాపం… ఈపాటికి జాబ్ క్యాలెండర్ వచ్చేది కదా.. పవన్ 3 పెళ్ళిళ్లు చేసుకోకపోయింటే పాపం… ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగుండేది కాదు కదా.. మీరు ఒక ముఖ్య మంత్రిగా నొక్కని బటన్స్ చాలా వున్నాయి.. మొదట వాటికి సమాధానం ఇవ్వటం అనేది మీ బాధ్యత.. రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ విషయం అవసరమైన అంశం కాదని హెచ్చరించారు.