ట్రంప్ రాకపోవడమే మంచిది: బైడెన్‌

అమెరికా 46వ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌.. ఈనెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావడం లేదని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బైడెన్ తెలిపారు. ఇదో మంచి పని ఆయన అన్నారు. దిలావర్‌లోని వెల్మింగ్టన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ట్రంప్ తీసుకున్న నిర్ణయం గురించి తనకు తెలిసిందని, ఆ నిర్ణయాన్ని తాను కూడా అంగీకరిస్తున్నాని బైడెన్ అన్నారు. అతను రాకపోవడమే మంచిదని జో తెలిపారు. దేశానికి ట్రంప్ ఓ తీరని కళంకంగా మిగిలినట్లు బైడెన్‌ ఆరోపించారు. దేశాధ్యక్షుడిగా సేవ చేసేందుకు ట్రంప్ ఫిట్‌గా లేరని బైడెన్ అన్నారు. అమెరికా చట్టసభ ప్రతినిధులు కూడా ట్రంప్‌ను అభిశంసించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ట్రంప్‌పై తనకు ఉన్న చెడు భావనలు అతను మించిపోయినట్లు బైడెన్ ఆరోపించారు. అమెరికా దేశ చరిత్రలోనే ట్రంప్ ఓ అసమర్థ అధ్యక్షుడు అని అన్నారు. ప్రమాణ స్వీకారం వేళ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఉంటే బాగుంటుందని బైడెన్ అభిప్రాయపడ్డారు. క్యాపిటల్ హిల్ దాడితో ట్రంప్‌పై వ్యతిరేకిత మరింత పెరిగింది.