కుటుంబం గురించి అవహేళన చేయడం సరైనది కాదు.. మనుక్రాంత్ రెడ్డి

నెల్లూరు: నగరంలోని స్థానిక డిఎస్పి కార్యాలయం నందు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీకి వినతిపత్రం అందజేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కుటుంబసభ్యులను విమర్శిస్తూ, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉంటే వాటి మీద దృష్టి సారించకుండా వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సరైనది కాదు అని అన్నారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ.. వైసీపీ శ్రేణులు ఇదేవిధంగా వ్యక్తిగత విమర్శలు చేస్తే రానున్న ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు, ఆలియా, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.