నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన భాధ్యత ఎమ్మెల్యేదే

  • జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర

జగ్గంపేట నియోజకవర్గం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జనం కోసం జనసేన మహాయజ్ఞం 685వ రోజు కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతున్న జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర. బుధవారం నరేంద్రపట్నం గ్రామంలోని రైతులంతా కలిసి సూర్యచంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్కర ఆయకట్టులో ఉన్న రైతులంతా పుష్కర నీరు వస్తుందనే నమ్మకంతో ఏకరాకు సుమారు 50 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టీ పంటలు వేశారని కానీ ఇవ్వాల్సిన సమయానికి నీరు అందివ్వక వేసిన పంటలు అన్ని ఎండిపోయాయని, కనీసం రైతులు పంటలు వేసే ముందే ప్రభుత్వం మరియు అధికారులు కలిసి పుష్కర ఆయకట్టులో ఉన్న రైతులకు ఈ సంవత్సరానికి సాగునీరు అందించడం కుదరదు అని ముందే ప్రకటించి ఉంటే రైతులు పంటలకు పెట్టుబడి పెట్టి అనవసరంగా నష్టపోయి ఉండేవారు కాదని చెప్పారు. ఈ విధమైన పంట నష్టానికి ప్రభుత్వమే కారణం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గారు భాధ్యత వహిస్తూ ప్రభుత్వం నుండి నష్ట పోయిన రైతులందరికి ఎకరానికి 50 వేలు రూపాయలు నష్ట పరిహారం వచ్చేలా కృషి చేసి పుష్కర ఆయకట్టులో ఉన్న రైతులందరిని ఆదుకోవాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు.