సోను సూద్ పై ఐటీ సోదాలు

ప్రముఖ న‌టుడు, క‌రోనా స‌మ‌యంలో పేద‌ల పాలిట దేవుడిగా మారిన సోనుసూద్‌కు చెందిన ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జ‌రుగుతున్నాయి. ముంబై, లోక్నోతో పాటు దేశవ్యాప్తంగా ఆరు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు చేస్తోంది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న దేశ్‌ కే మెంటార్స్ కార్యక్రమానికి సోనూసూద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక‌య్యారు. ఈ స‌మ‌యంలో ఐటీ రైడ్స్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

గత సంవత్సరం లాక్‌డౌన్‌ కారణంగా దేశ‌, విదేశాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా విమానాలు, బస్సులు ఏర్పాటు చేసి సొంత గ్రామాలకు త‌ర‌లించారు. ఆప‌ద‌లో ఎవ‌రు పిలిచినా ప‌లికారు. స‌హాయం చేశారు. అయితే, సోనూసూద్ ఇటీవ‌ల ఢిల్లీ సీఎంతో త‌ర‌చూ భేటీ అవుతున్న త‌రుణంలో ఐటీ సోదాలు జ‌ర‌గ‌టం అనేక ఊహాగానాల‌కు దారి తీస్తుంది.

ట్రూ సోల్జ‌ర్ కు పెద్ద బుద్దే చెబుతున్నారు అంటూ సోష‌ల్ మీడియా ఫైర్ అవుతుంది.