రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన ఘనత జగన్ దే: డా.పసుపులేటి హరిప్రసాద్

  • రెక్కల కష్టాన్ని పంచిపెడుతున్న మా నాయకున్ని విమర్శించే అర్హత జగన్ కు లేదు
  • మీ నాన్న సిఎం కాక ముందు మీ ఆస్తులెంత?
  • సిఎం జగన్ కు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సూటి ప్రశ్న

తెలంగాణ, రెక్కల కష్టాన్ని ప్రజలకు పంచి పెడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత సిఎం జగన్ కు లేదని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సిఎం జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఆయన ఓ పత్రికా ప్రకటనలో ఖండించారు. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన జగన్ మోహన్ రెడ్డి ముందు తనను తాను ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. 2019 ఎన్నికలకు ముందు తాడేపల్లిలో సొంత ఇంటిని నిర్మించుకున్న జగన్ మోహన్ రెడ్డి. అంతకు ముందు హైదరాబాద్ లోటస్ పాండ్, బెంగుళూరుల్లో ప్యాలెస్ లలో ఉన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సినిమాలు చేయడం అనేది పవన్ కళ్యాణ్ వృత్తి అని. ఆయన సినిమాల్లో కష్టపడి సంపాదించిన డబ్బును ప్రజలకు పంచి పెడుతున్నారన్నారు. కౌలు రైతులతో పాటు, దేశానికి సేవ చేసిన సైనిక సంక్షేమ నిధికి భారీగా విరాళాలు ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్సార్ సిఎంగా ఉన్నప్పుడు దోచుకున్న లక్ష కోట్లలో నుంచి ఎన్ని కోట్లు ప్రజల కోసం సొంత డబ్బును పంచి పెట్టారో జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. సొంత నిధులతో సొంత ఊరైన పులివెందులకు ఏమీ చేయని జగన్ మోహన్ రెడ్డి. కోట్ల రూపాయలను పంచి పెడుతున్న తమ అధినాయకున్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. పవన్ కళ్యాణ్. జగన్ మోహన్ రెడ్డి లాగ ల్యాండ్, శాండ్, బ్రాండ్ అంటూ అన్నిట్లో దోచుకోవడం లేదని, కష్టపడి సినిమాలు తీస్తున్నారన్నారు. దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారకంగా మార్చేందుకు భారీగా విరాళం ఇచ్చన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రక్రుతిని నాశనం చేస్తూ ప్రక్రుతి వనరులను దోచుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారన్నారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడితే కేసులు వేస్తామని హెచ్చరించారు. ఆయన పెళ్లిళ్ల గురించి ఎవరైనా ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే పరిపాలన కోసం అమరావతిలో భవనాలు నిర్మించారన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం అమరావతి, వైజాగ్ లలో ఒక్క భవనం కూడా పరిపాలన కోసం నిర్మించకుండా తన నివాస భవనాలను నిర్మించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును విమర్శించే అర్హత జగన్ లేదని ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ హితవు పలికారు.