అన్న వస్తే మంచి రోజులు వస్తాయని చెప్పి పూర్తిగా నిరుద్యోగులను ముంచేశాడు జగన్ రెడ్డి

  • ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల

ప్రకాశం జిల్లా, ఒంగోలు, పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షలది ఉద్యోగాలు భర్తీ చేస్తాను అని చెప్పి అధికారంలోకి రాగానే ఇప్పుడు నిరుద్యోగులను నట్టేట ముంచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగాలు రాక ప్రైవేటు ఉద్యోగాలు లేక పొట్ట చేతపట్టుకొని ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు ఆంధ్ర ప్రదేశ్ యువత, ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు న్యాయం చేయండి,జనసేన పార్టీ తరపున ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము ఖాళీగా ఉన్న లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయండి, లేనిపక్షంలో నిరుద్యోగ యువతతో కలిసి నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల తెలిపారు.