జగన్ రెడ్డికి పేదల పట్ల చిత్తశుద్ధి లేదు: గంగారపు రాందాస్ చౌదరి

మదనపల్లి జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేసంలో జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనియెర్ గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బీద పలుకులు పలుకుతూ ఆయన ఏదో చాలా పేదవాడైనట్టు మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా సిగ్గేస్తుంది. పేద పలుకుల పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకానికి ఇవ్వవలసిన బకాయిలు దాదాపు 1000 కోట్లు పైగా చెల్లించకుండా, ఆరోగ్యశ్రీ కింద ఉన్న ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్య సిబ్బంది, డాక్టర్లు ఆందోళన చెంది చెల్లించవలసిన బకాయిలు చెల్లిస్తే కానీ మేము ఆరోగ్యశ్రీ సేవలు అందించలేమని చెప్పే స్థితికి వచ్చారంటే ఈయనకు పేదల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతాంది. నవ రత్నాల సంగతి ఏంటో కానీ నవనిర్మాణాలైతే బెంగళూరు, తాడేపల్లి, ఇడుపులపాయ, కడపలో, హైదరాబాదు లోటస్పాండ్, ఇలా తొమ్మిది కోటల నిర్మించి జీవిస్తా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే పేదవాడు అని ఎద్దేవా చేశారు. సిమెంట్ కర్మాగారాలు, సాక్షి ఛానల్, పేపర్ ఇంకా అనేక సంస్థలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడే. పవన్ కళ్యాణ్ గురించి దత్తపుత్రుడు అని చంద్రబాబు గారు ఏం చెప్తే అది చేస్తున్నారని అంటున్నారు. ఆయన కాదు దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కి నిజమైన దత్తపుత్రుడని జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనియెర్ గంగారపు రాందాస్ చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగాలు నాయకులు అడపా సురేంద్ర, ఐటీ విభాగ నాయకుల జగదీష్, లక్ష్మీపతి, జనార్ధన్, రెడ్డమ్మ, సనావుల్లా గ్రానైట్ బాబు, శంకర తదితరులు పాల్గొన్నారు.