జగన్ రెడ్డి నిజ స్వరూపం మరోసారి బయట పడింది

  • జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లి: నా ఎస్టీ లు నా ఎస్సీ లు నా బీసీలు మైనారిటీ లు అని దొంగ పలుకులు పలికే ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం మరోసారి బయట పడిందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి కమ్మవీధిలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలసి విలేకర్ల సమావేశంలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా లో రెంటచింటల గ్రామంలో సామినిబాయి అనే ఎస్టీ మహిళా తాగడానికి నీళ్ల కోసం వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్తే ఆమె తెలుగుదేశం పార్టీ సానుభూతి పరురాలు అని కక్ష కట్టి ఆ ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ తో తొక్కించి చంపడం జరిగింది.కనీసం బాధ్యత గల ప్రభుత్వం కనీసం అనుమానస్పద మృతి అని రాయకుండా ఏకంగా ఆక్సిడెంటల్ మృతి రాసి కేసు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్న జగన్ ఎంతటికి దిగజారిపోయాడని జనసేన పార్టీ తరుపున ప్రశ్నించారు. దళిత యువకుడిని చంపి వాళ్ల ఇంటికి డోర్ డెలివరి చేసిన వ్యక్తికి అతను ఎదో స్వాతంత్ర సమరయోధుడని అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు, కరోనా సమయంలో మాస్క్ లు లేవని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ గారిని ఆత్మ క్షోబకి గురి చేసి ఆయన చావు కి కారణం అయ్యాడని విమర్శించారు. సొంత తల్లి, చెల్లి బాబాయ్ కూతురు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి హంతకులను ప్రోత్సహించే రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని, హంతకులు పాలించే వారికీ ఓటు వేయద్దని అంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమం లో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, జిల్లా జాయింట్ సెక్రటరీ లు సనా ఉల్లా, గజ్జల రెడ్డెప్ప, రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు, రామసముద్రం అధ్యక్షులు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర, ఐటీ విభాగ నాయకులు లక్ష్మి నారాయణ, లవన్న, వీరమహిళ పట్టణ సెక్రటరీ నాగవేణి, జవిలి మోహన్ కృష్ణ, రూరల్ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, జాయింట్ సెక్రటరీ రెడ్డి శేఖర్ రెడ్డి, నరేష్, సెక్రటరీ జయ, జనర్దన్, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ ఉపాధ్యక్షులు పురం నగేష్ తదితరులు పాల్గొన్నారు.