తెల్ల రేషన్ కార్డు పొందడానికి మరొక అవకాశం ఇచ్చిన జగన్ సర్కార్

నిరుపేద కుటుంబాలకు లబ్ది చేకూర్చేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాల ద్వారా తెల్ల రేషన్ కార్డుకు అనర్హులైన లబ్దిదారులు.. మరోసారి కార్డు కోసం సహేతుక ఆధారాలతో తిరిగి నవశకం కార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా వెల్లడించారు.

తెల్ల రేషన్ కార్డు కోసం లబ్దిదారులు తమ సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని.. ఆ అప్లికేషన్ ఫార్మ్‌తో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను కూడా జత చేయాలని సూచించారు. ఆ దరఖాస్తులను సంబంధిత గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది పరిశీలిస్తారు. తద్వారా అనర్హత పొందినవారు మరలా తెల్ల రేషన్ కార్డు పొందే అవకాశాలు ఉంటాయని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు.