పెనుకొండ జనసేన ఆద్వర్యంలో జగనన్న మోసం డిజిటల్ క్యాంపెయిన్

పెనుకొండ నియోజకవర్గం, సత్యసాయి జిల్లా: జగనన్న ఇళ్ళు – పేదోళ్ళ కన్నీళ్ళు అనే సామాజిక పరిశీలన భాగంగా సోమవారం సోషల్ ఆడిట్ కార్యక్రమం నిర్వహించి. పెనుకొండ పట్నంలోని స్థానిక సచివాలయం మరియు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి ది ఈ ని ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్ల పై సమాచారం కోరిన పెనుకొండ మండల కన్వీనర్ మహేష్ నిర్మిస్తున్న ఇళ్లు ఎంతవరకు పూర్తయినాయి అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లకు కనీస సౌకర్యాలు రోడ్లు, వాటర్ రిజర్వాయర్, కల్పించకుండా నిర్మిస్తున్నారు. ఇలా నిర్మిస్తే ప్రజలు ఎన్ని ఇబ్బందిలకు గురవుతారనే జ్ఞానం కూడా లేకపోతె ఎలా అంటూ స్థానిక ఎమ్మెల్యే శంకర్నారాయణపై అధికార పార్టీ నాయకులను నిలదీసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు రాజేష్, మండల అధ్యక్షుడు మహేష్, నగర అధ్యక్షుడు లోకేష్, మండల ఉపాధ్యక్షులు సురేష్, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మండలం సీనియర్ నాయకులు బంగారం, హరి నాయక్ యువ నాయకులు మల్లేష్, శ్రీనివాస్ నాయకులు సురేష్, అనిల్ కుమార్, రఫీక్, రాజు, రమేష్, వేణు తదితరులు పాల్గొన్నారు.