జర్నలిస్ట్ పరమేశ్వరరావు మీద దాడిని ఖండించిన వబ్బిన సన్యాసి నాయుడు

శృంగవరపుకోట, వైసీపీ గొడ్డలి పార్టీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. పల్నాడు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను బయట పెట్టిన అమరావతి ఈనాడు దినపత్రిక విలేకరి పరమేశ్వరరావు మీద దాడి చేసిన జైలు పార్టీ వారిని వెంటనే అరెస్టు చేయాలని సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ విజయనగరం జిల్లా అద్యక్షులు వబ్బిన సన్యాసి నాయుడు డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్ లు ఇద్దరూ జర్నలిస్ట్ మీద నల్ల చట్టాలు తీసుకుని రావడం సిగ్గుచేటన్నారు. పల్నాడు ఎస్.పి.రవి శంకర్ రెడ్డి నిర్లక్ష్యంగా ఉన్నందున మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, జర్నలిస్ట్ ల మీద, జనసేన, బిజెపి నాయకులు మీద దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిపి రాజేంద్ర నాథ్ రెడ్డి పార్టీ కార్యకర్తగా జగన్ భజన చేయడం పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం మీద జర్నలిస్ట్ సంఘాల చేసే పోరాటాలకు కాపు సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వబ్బిన సన్యాసి నాయుడు ప్రకటించారు.