జగనన్న కాలనీలతో సాకారం కాని పేదల సొంతింటి కల

బనగానపల్లి, జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12, 13, 14 తేదీలలో నిర్వహిస్తున్న జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా 14వ తేది మూడవ రోజు కోవెలకుంట్ల మండలం సంబంధించిన జగనన్న కాలనీని పరిశీలించి అక్కడ పరిస్థితులను బనగానపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు భాస్కర్ తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడా కానీ జిల్లా స్థలాలు పూర్తి పేదలకు అందిన దాఖలాలు లేవని రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది ఉందని ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తే వైసిపి నాయకులకు నచ్చడం లేదని ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రశ్నించడం జరుగుతుందని ఓట్లు వేసి రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన పార్టీ పై బాధ్యతతో వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కానీ భిన్నంగా రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నాయకులు సమస్యలపై కాకుండా ప్రశ్నిస్తున్న వారిపై ఎదురుదాడికి దిగుతోందని ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలని కోరడం తప్పు లాగా కనిపిస్తోందని పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయాల్సిన బాధ్యత హామీ ఇచ్చిన ప్రభుత్వానిదే అని జగనన్న కాలనీల పేట రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల 30 వేల మందికి ఇల్లు నిర్మించి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారి చెప్పారని అందులో భాగంగా 18,63,552 గృహాలను జూన్ నెల 2022 సంవత్సరానికి అందజేస్తామని అన్నారని గడువు దాటి ఐదు నెలలు అవుతున్న ఇప్పటికే 10% గృహాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అందిన దాఖలాలు లేవని త్వరలోనే వాటి పూర్తిగా చేసి పేదల సొంతింటి కలను సాకారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొలిమిగుండ్ల నాయకులు పృద్వి అవుకు, నాయకులు అజిత్ రెడ్డి, జనార్ధన్, కిరణ్ రెడ్డి, బాషా సందీప్ తదితరులు పాల్గొన్నారు.