పిడుగురాళ్లలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీ సాయి వృద్ధాశ్రమ నందు పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీ సాయి వృద్ధాశ్రమ నందు, మెగా అభిమానులు కామిశెట్టి రమేష్, ఎర్నాన్న రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిడుగురాళ్ల పట్టణ కాపు నాయకులు పెద్దలు ఆకుల నాంచారయ్య పాల్గొని కేక్ కటింగ్ చేశారు. అనంతరం వృద్ధులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామిశెట్టి రంగా, బయ్యవరపు రమేష్, ఉమామహేశ్వరరావు, (ఈసా) పసుపులేటి నరసింహారావు, బేతంచర్ల ప్రసాద్, నాగేశ్వరరావు, బుడే, తోటా రామదాసు, ఆవుల రమేష్, మాటూరి లింగయ్య, అంబటి సాయి, గౌరీ, సాగర్, మొదలగు మెగా అభిమానులు పాల్గొన్నారు.