జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు: మర్రాపు సురేష్

గజపతినగరం సీనియర్ నాయకులు, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జగనన్న ఇళ్లు వలన పేదలందరి కన్నీళ్లు పెట్టుకుంటున్న బాధలను సోషల్ మీడియాలో ప్రజలకు తెలియజేయాలని చెప్పే కార్యక్రమంలో భాగంగా జనసేనపార్టీ గజపతినగరం నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈ నెల నవంబర్ 12,13,14 తేదీల్లో గజపతినగరం నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఉన్న జగనన్న ఇళ్లు మంజూరులో జరిగిన మోసాలను వెలికితీసి ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం #జగనన్నమోసం జగన్ నవరత్నాలలో ఒక్కటైన జగనన్న ఇళ్లు మంజూరులో జరిగిన మోసాలను వెలికితీసి ప్రజలకు, ప్రతీఒక జనసైనుకుడు, వీరమహిళలు తెలియజేయాలని కోరారు. కాగా రాష్ట్రంలో జగన్ రెడ్డి రాష్ట్రం మొత్తమ్మీద మొదటి విడతలో 18 లక్షలు గృహాలను 2022, జూన్ నాటికి మంజూరు చేస్తామని మాట ఇచ్చి, ఇప్పటికీ ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని, భూములు కొనుగోలులో కూడా వేలకొట్లలో కుంభకోణాలు జరిగాయని. ఈ అక్రమాలను బయటకు తీసి ప్రజలకు తెలియ పరుస్తామని అన్నారు. ఇంతవరకు సుమారు ఒక్క లక్షా ఏబైవేలు మాత్రమే ఇల్లులు నిర్మించారని. ఈ జగనన్న మోసాలను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మొదటిరోజు, నవంబర్, 12వ తేదీ శనివారం గజపతినగరం మరియు దత్తిరాజేరులో 13వ తేదీన బొండపల్లి, గంట్యాడ, జామి మండలాల్లో జగనన్న కాలనీలో నిర్మితమైన ప్రాంతంలో నిరసన చేపడతామని తెలిపారు.