వట్టి గెడ్డ రిజర్వాయర్ ను సందర్శించిన జనసేన నాయకులు

కురుపాం నియోజకవర్గం: తూతూమంత్రంగానే వట్టిగెడ్డ రిజర్వాయర్ మరమ్మత్తు పనులు చేపట్టారని కురుపాం నియోజకవర్గ జనసేన పార్టి సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు ఆరోపించారు. శనివారం జనసేన నాయకులతో కలిసి జియ్యమ్మవలస మండల పరిధిలో గల రావాడ వట్టిగెడ్డ రిజర్వాయర్ ను సందర్శించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రిజర్వాయర్ అభివృద్ధి కొరకు జె ఐ సి ఏ నిధులు (సుమారుగా 44 కోట్లు) రిలీజ్ కావటం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే ఈ మొత్తం గ్రాంట్ లో సుమారుగా 7 కోట్లు వరకు మరమ్మత్తు పనులు చేసినట్లు చెప్పుకుంటున్నారని పూర్తి స్థాయిలో పనులు కాకపోవడం వలన ఈ వట్టిగెడ్డ రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో గల వ్యవసాయ రైతులు సరైన సమయానికి నీరు అందకపోవడం వలన డ్యాంకు సంబందించిన ఎడమ కాలువ పూడికతీత పనులు రైతులంతా ఏకమై వారి సొంత నిధులతో పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. తక్షణమే పనులు పునఃప్రారంభం చేయాలని ప్రభుత్వాన్ని, స్థానిక వైసీపీ ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. అనంతరం జనసేన నాయకులు జియ్యమ్మవలస మండల అధ్యక్షులు వారణాశి శివకుమార్, కార్యనిర్వహణ కార్యదర్శి నేరేడుబిల్లీ వంశీ, పెంట శంకరరావు, నియోజకవర్గ ఐటి కోఆర్డినేటర్ లచ్చిపతుల రంజిత్ కుమార్, మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వచ్చాక నియోజవర్గం ఏమీ అభివృద్ధి చెందలేదని, 2024లో జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వము ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వావిలపల్లి రాజేష్, గంటేడ భార్గవ, జనసైనికులు, రైతులు పాల్గొన్నారు.