పాలకొల్లు జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు

పాలకొల్లు నియోజకవర్గం, పోడూరు మండలం, వేడంగి గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు అనే కార్యక్రమంలో భాగంగా వేడంగి జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొని జగనన్న ఇళ్ల స్థలాలలో జరిగిన అవకతవకలపై మాట్లాడారు. మాట తప్పను మడమ తిప్పను అనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇల్లు ఇచ్చి వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తానని మాట ఇచ్చి వాళ్ళ కళ్ళలో కన్నీళ్లు చూస్తున్నారు అని జనసైనికులు అన్నారు. రూపాయి తీసుకోకుండా ఇల్లు కట్టిస్తామని చెప్పి అక్షరాలా 25000 రూపాయలు తీసుకుని, డబ్బులు తీసుకున్న తరువాత వాళ్లనే కట్టుకోమని కట్టుకోకపోతే ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటామని చెప్పి బాధితులకు భయానికి గురిచేస్తున్నారు. వాళ్లకు ఇచ్చే 180000 రూపాయలు పునాదులకే సరిపోక పేదలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని స్థలాలలో వారికి ఇల్ల స్థలాలు కేటాయించారు. గ్రామానికి దూరంగా ఇళ్ల వలన దొంగల బెడద కూడా ఎక్కువ అయ్యింది అందువలన శ్రీ జగన్మోహన్ రెడ్డి దీనిమీద దృష్టి సారించి అక్కడ జరిగిన అవకతవకలపై అధికారులను అడిగితెలుసుకుని మా గ్రామం లో ఉన్న పేద ప్రజలకు న్యాయం చేయవలిసిందిగా జనసైనికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన ఎంపీటీసీ యర్రంశెట్టి వెంకటనరసింహరావు, జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్ కొర్రకూటి హరికృష్ణ, జనసేన పార్టీ ఎస్సీ సామాజిక వర్గ నాయకులు నల్లి వెంకటేశ్వరావు, గ్రామ జనసేన గౌరవ అధ్యక్షులు యర్రంశెట్టి అన్నవరం, జనసేన మండల కమిటీ అధ్యక్షులు కూనపరెడ్డి శ్రీనివాస్, జనసేన జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ బొలిశెట్టి నాగ రమేష్ మరియు గ్రామ కమిటీ సభ్యులు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.