తాడిపత్రి జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు

తాడిపత్రి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు, తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గంలోని రూరల్ గ్రామాలైనటువంటి ఎర్రగుంట్లపల్లి, చిన్న పడమల మరియు ఆర్.డి.టి కాలనీలోని జగనన్న ఇళ్లను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూములను జగనన్న కాలనీల పేరుతో పేదలకు పంచిపెట్టారు కానీ ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణం జరగలేదని నిర్మించిన కొన్ని ఇల్లు కూడా పునాదుల దగ్గరే ఆగిపోయాయని తెలిపారు, ఆ పునాదులన్నీ కేవలం ఒక అడుగు లెంటెల్ ఉపయోగించి భూమికి పైభాగాన నిర్మించారని దీని కారణంగా ఆ లెంటల్లపై నిర్మించే గోడలు ఎంత మాత్రం ధృడంగా ఉంటాయో చెప్పలేమని శ్రీకాంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. వీటి నిర్మాణానికి సంబంధించిన సూపర్వైజర్ తో మాట్లాడగా ప్రభుత్వ ఆదేశాల మేరకే మేము నిర్మించగలమని ఇందులో మా సొంత నిర్ణయాలు లేవని వాపోయారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్నా జగనన్న కాలనీలలో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుందని ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేయడంలో ఓ భాగమని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. చాలామంది లబ్ధిదారులు వారి సొంత డబ్బుతోనే ఇళ్లను నిర్మించుకుంటున్నామని, ప్రభుత్వం నుంచి కేవలం 1,80,000 రూపాయలు మాత్రమే అందిందని, కానీ పూర్తిస్థాయిలో ఇల్లు నిర్మించుకోవడానికి 6 నుండి 8 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు “జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు” కార్యక్రమం పేరుతో ప్రభుత్వం చేస్తున్న మోసాలను అవినీతిని జనసేన పార్టీ ద్వారా ప్రజలకు తెలియజేయడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆదివారం కూడా మిగిలిన మండలాలలోని జగనన్న కాలనీలను సందర్శించి ప్రభుత్వం అవకతవకలను బయటపెడతామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్, పట్టణ అధ్యక్షులు నరసింహచారి, యాడికి మండల ఇంచార్జ్ సునీల్ కుమార్, తాడిపత్రి పట్టణ ఉపాధ్యక్షులు గోపాల్, పెద్దవడుగురు నాయకులు దూద్ వలి పట్టణ ప్రధాన కార్యదర్శులు కొండాశివ, మణికంఠ, రసూల్ మరియు జనశైనికులు జాకీర్ హుస్సేన్, గుండ్లశివ, నాగర్జున తదితరులు పాల్గొన్నారు.