నాదెండ్ల మనోహర్ ని కలిసిన జగ్గంపేట జనసేన నాయకులు

జగ్గంపేట, జగ్గంపేట నియోజకవర్గ జనసేన నాయకులు ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని వారి స్వగృహంలో కలవడం జరిగిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాతో మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం అని సంభోదిస్తూ మన నియోజకవర్గంలో ఇటీవల చెక్కుల పంపిణీ విషయపై ఆయన సందర్శించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ సభ్యత్వాలు బాగా చేయాలని జగ్గంపేట నియోజకవర్గంలో పార్టీని గ్రౌండ్ స్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు. ప్రతీ రాజకీయపార్టీలో కార్యకర్తలే మూల స్థంబాలు లాంటి వారు అని జనసేన పార్టీ రేపటి విజయానికి కార్యకర్తలే బలం అని చెప్పారు. మార్చి తరువాత భారీ ఎత్తున చేరికలు ఉంటాయని, జగ్గంపేట నియోజకవర్గంలోని పలు సమస్యలపై సుదీర్ఘంగా అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా పార్టీ గుర్తిస్తుంది అని మీకు ఎప్పుడు పార్టీ అండగా ఉంటుంది అని చెబుతూ నిరంతరం పార్టీ అభివృద్ధి మరియు రాష్ట్ర ప్రజలకోసం ఆలోచించే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వెనక మనం పనిచేయడం నిజంగా అంత గొప్ప నాయకుడు మనకు దొరకడం మన అదృష్టంగా భావించాలి అంటూ ఎంతో విలువైన సమయాన్ని, సమాచారాన్ని మాకుఇచ్చి ఆయన అనుభవాన్ని మాకు పంచి మాలో ఎంతో ఉత్సాహాన్ని కలిగించారు. జనసేనపార్టీతో మా సుధీర్ఘ ప్రయాణంలో మనోహర్ ని ఎన్నోసార్లు కలిసినా ఈ సమయం, సందర్భం చాలా ప్రత్యేకమైందని జనసేనపార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలిసిన వారిలో కిర్లంపూడి మండలాధ్యక్షులు ఉలిసి అయిరాజు, పాలిశెట్టి సతీష్, గాది రాంబాబు తదితరులు ఉన్నారు.