దళిత వాడల్లో జనచైతన్యం గ్రామం రాయవరం ప్రాంతం ఎస్సి కాలని

పిఠాపురం చైతన్య వంతమైన దళిత యువకులను జనసేన పార్టీ వైపుగా నడపడమే లక్ష్యంగా పిఠాపురం రూరల్ జనసేన నాయకుడు మరియు దళిత నాయకులు అయిన వాకపల్లి సూర్య ప్రకాశ్ పిఠాపురం రూరల్ మండల వ్యాప్తంగా మొదలు పెట్టిన దళిత వాడల్లో జనచైతన్యం అనే కార్యక్రమం మంగళవారం రాయవరం గ్రామం ఎస్సి కాలనీకి చేరుకుంది. నియోజకవర్గ నాయకులు వూట ఆదివిష్ణు (నానినాబు) సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మరియు గొల్లప్రోలు మండల బిసి నాయకులు మొగిలి అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా వాకపల్లి సూర్యప్రకాశ్ స్థానిక జనసైనికులు వెంకటేష్, దొరబాబు, దుర్గాప్రసాద్ ల సూచన మేరకు ఆసరా లేని స్థానిక దళిత వృద్ధురాలు అయిన చిట్టమ్మకు రైస్ బ్యాగ్ తో కూడిన నెలవారీ నిత్యావసరాలను డొనేట్ చేసిన తదనంతరం పవన్ కళ్యాణ్ వీరాభిమానులు అయిన స్థానిక దళిత యువకులతో సమావేశమయ్యారు. యువతకు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ సమసమానత్వంతో కూడిన రాజకీయ విలువలు గౌరవం ఒక్క జనసేన పార్టీ మాత్రమే మనకు అందిస్తుంది అని మనం చేయి చేయి కలిపితే రాజ్యాధికారం సాధ్యమౌతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.