యువతకి పెద్దపీట వేసే పార్టీ జనసేన: లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం, నెల్లిమర్ల మండలం జరజాపు పేట పంచాయతీలో ఇండియన్ ఆర్మీ అగ్నిపత్ ఫేస్-1 పాస్ అయ్యి శిక్షణ తీసుకుంటున్న యువకులు ఆ ప్రదేశంలో నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకొని లోకం మాధవి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. గత కొన్ని రోజుల నుండి ఆ శిక్షణ పొందుతున్న యువకులకు గ్లూకోస్ పానీయాలు కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే ఆదివారం జరజాపు పేట మరియు ధనాలపేట నుండి శిక్షణ పొందుతున్న యువకులకి శరీర బలానికి తోడ్పడే పౌషక పదార్థాలైన ఖర్జూరం, బాదం, అరటి పండ్లు మరియు కోడిగుడ్లను లోకం మాధవి పంపిణీ చేయడంతో పాటూ వాళ్లతో ముచ్చటించారు. నెల్లిమర్ల నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో యువకులు ఇండియన్ ఆర్మీ అగ్నిపత్ కు ఎంపిక అవుతారని ఆశిస్తున్నట్టు మాధవి తెలిపారు. ఇంతమంది యువత దేశానికి సేవ చేయాలనుకోవడం ఎంతో గర్వకారణమని, యువతకి పెద్దపీట వేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క జనసేన పార్టీనే అని తెలియజేశారు.