కార్యకర్తలను సొంత కుటుంబంలా ఆదుకునే పార్టీ జనసేన: విడివాడ

భీమవరం: రేలంగి గ్రామానికి చెందిన జనసైనికుడు కచ్చేటి ఆంజనేయులుకు ప్రేగు సంబంధిత అనారోగ్య సమస్య రావడంతో విజయవాడలో ఓ ప్రెవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోగా సుమారు 15 లక్షల ఖర్చు అయ్యింది. అయినా ఇంకా నయం కాకపోవడంతో తదుపరి వైద్య ఖర్చులు నిమిత్తం ఇంకో 10 లక్షల వరకు అవసరం అవుతుంది అని డాక్టర్లు చెప్పడంతో, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అతనికి సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో భీమవరం మండల జనసేన పార్ట్ ఎంపీటీసీ లు ఆరేటి వాసు, తాతపూడి రాంబాబుల ఆధ్వర్యంలో సోషల్ మీడియా వేదికగా సుమారు రెండు లక్షల రూపాయిలు సేకరించడం జరిగింది. ఒక లక్ష రూపాయలు నేరుగా బాధితుడి అకౌంట్ కి పంపించగా, అమెరికా ఎన్.ఆర్.ఐ జనసైనికులు 1 లక్ష రూపాయలు పంపించారు. ఆ డబ్బును తణుకు నియోజకవర్గ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు సమక్షంలో బాధితుడికి అందించడం జరిగిందని ఎంపీటీసీ లు తెలియజేసారు. ఈ సందర్భంగా విడివాడ రామచంద్ర రావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో కార్యకర్తలు ఎన్నో సేవా కార్యక్రమాల చేస్తున్నారని, సోమవారం ఆంజనేయులుకి ఈ సహాయం చేసిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందిస్తున్నాను అని ఎంపీటీసీ లు ఆరేటి వాసు, తాతపూడి రాంబాబులు భీమవరం అయినప్పటికీ తణుకు జనసైనికుడికి సహాయం చెయ్యడానికి వారు చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇరగవరం మండల అధ్యక్షుడు అకేటి కాశీ, పసుపులేటి గణేష్, మారిశెట్టి అయ్యప్ప, పసుపులేటి అబ్బులు మరియు రేలంగి గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.