దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎం జగన్ కు జనసేన కంగ్రాట్స్

  • జైలు జీవితాన్ని మరచిన జగన్
  • ఆస్తులు జగన్ కి & అప్పులు ప్రజలకి
  • ఆస్తుల్ని మరచిన గజిని సీఎం జగన్ రెడ్డి
  • జగన్ ఎన్ని అబద్ధాలు చెప్పినా జనం నమ్మరు
  • జనసేన నాయకుల విమర్శనాస్త్రాలు

తిరుపతి: ఓ సర్వే సంస్థ చేసిన సర్వేలో దేశంలోనే అత్యంత ధనికుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని ప్రకటించిందని, దీనిపై ప్రముఖ పత్రికలలో కూడా కథనాలు వచ్చాయని ముఖ్యమంత్రి జగన్ ప్రజల ముందు అమాయకుడిలా నటిస్తున్నారని, గజినీ లాగా జగన్ కు మతిభ్రమించిందా అంటూ ఆస్తులు జగన్ కి.. అప్పులు ప్రజలకి ఇది జగన్ సిద్ధాంతమా అంటూ జనసేన నేతలు గురువారం ఓ ప్రైవేటు హోటల్లో రాష్ట్ర సీఎం జగన్ ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు మాట్లాడుతూ జగన్ తండ్రి కీర్తిశేషులు వైయస్సార్ సీఎంగా ఉన్న రోజుల్లో వెనకుండి రాష్ట్రాన్ని దోచుకుని అవినీతి సామ్రాట్ గా ఎదిగి ఏ వన్ నిందితుడిగా జైలు జీవితం గడిపి దోచిన ధనాన్ని పెట్టి ఓట్లు కొని సీఎంగా ప్రజల మాటున జైలు శిక్షను తప్పించుకుని దాగివున్న జగన్ ఓ గజినీలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. కొన్ని వేళల్లో కొందరిని మాత్రమే మోసం చేయగలరని, అన్ని వేళల్లో అందరినీ మోసం చేయలేరని జగన్ ను హెచ్చరించారు, ప్రజలు మేలుకున్నారని ఈసారి రాష్ట్ర ప్రజలు వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తారని వారు జోష్యం చెప్పారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు బాబ్జి, కీర్తన, విజయ రెడ్డి, హేమ కుమార్, కొండ రాజమోహన్, మునుస్వామి, రాజేష్ ఆచారి, కిరణ్, మనోజ్, హేమంత్, బాలాజీ, పురుషోత్తం, సాయి, రాజేష్, ముత్యాలు మరియు రాష్ట్ర, జిల్లా, పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.