సింగరాయకొండ జనసేన ఆధ్వర్యంలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

  • సింగరాయకొండ నుండి పాత సింగరాయకొండ వెళ్లు రహదారి పరిస్థితి అధ్వానం
  • సింగరాయకొండ నుండి కందుకూరు వెళ్లు మండల ఆఫీస్ రోడ్డు పరిస్థితి అధ్వానం
  • సింగరాయకొండ నుండి పాకాల గ్రామం వెళ్లు రహదారి పరిస్థితి అధ్వానం
  • సింగరాయకొండ టౌన్ ట్రంక్ రోడ్డు రహదారి పరిస్థితి అధ్వానం

కొండపి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్ల పరిస్థితి విషయంలో గాఢ నిద్రలో ఉన్న సీఎం జగన్ రెడ్డికి తెలియజేసేలా చేయబడిన డిజిటల్ క్యాంపెయిన్ #GoodMorningCMSir ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలంలో పలు ప్రాంతాల రోడ్ల పరిస్థితి పరిశీలించిన మండల అధ్యక్షులు రాజేష్ రోడ్ల దుస్థితికి సంబంధించి ఫోటోలు చిత్రికించి #GoodMorningCMSir అనే హష్ టాక్ ద్వారా సామాజిక మద్యమాల్లో ప్రచురించడం జరిగినది. జులై 15 నాటికల్లా ఒక్క గుంత కూడ ఉండదు అని చెప్పిన సీఎం జగన్ ఒక గుంత గూడా పూడ్చని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది, ఇకనైనా గాఢ నిద్ర నుండి లేచి రోడ్లపై దృష్టి పెట్టాలని జనసేన నాయకులు నిరసన చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు అయినా బత్తిన రాజేష్, మండల నాయకులు కాసుల శ్రీనివాస్, అనుముల శెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాస్, సంకే నాగరాజు, సయ్యద్ చాన్ భాషా, పోలిశెట్టి విజయ్ కుమార్, షేక్ మా బాషా, షేక్ సుల్తాన్ భాషా, షేక్ సుబాని, చలంచర్ల కరుణ్ కుమార్, తగరం రాజు, పాలకుర్తి శ్రీనాథ్, సిమోను, వాయుల చిన్న మరియు జనసైనికులు పాల్గొన్నారు.