4వ డివిజన్లో జనంకోసం జనసేన

నెల్లూరు నగరంలోని 4వ డివిజన్లో “జనంకోసం జనసేన“ కార్యక్రమాన్ని జనసేన జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు జనసేన నేతల దృష్టికి పలు సమస్యలను తెలియజేశారు. లోపించిన పారిశుధ్యం, తాగునీరు, టిడ్కో గృహాలు, పింఛన్లు తొలగించడం వంటి సమస్యలను తీసుకువచ్చారు. వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి హామి ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.