పోలవరం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పోలవరం నియోజకవర్గం: టీ నర్సాపురం మండలం, మక్కిన వారి గూడెం గ్రామంలో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం పోలవరం నియోజవర్గ జనసేన ఇన్చార్జి చిర్రి బాలరాజు జనసేన పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. జనసైనికులకు, జనసేన నాయకులకు, వీరమహిళలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నవశకానికి మనదైన ముద్ర వేస్తూ, సుపరిపాలనే ధ్యేయంగా.. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజాశ్రేయస్సు కోసం జరగబోయే రేపటి ఎన్నికల తుదిపోరులో గెలుపు బాటకై రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళదామని తెలిపారు. రాక్షస పాలనా నుండి విముక్తి పొందాలంటే మనమందరం ఐక్యతతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అడపా నాగరాజు, జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.