చెట్లు నరికివేతపై జనసేన నేత శెట్టిబత్తుల ఆగ్రహం

అమలాపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హరిత విధ్వంసానికి పాల్పడుతుందని అమలాపురం జనసేనపార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జులై 26న ముఖ్యమంత్రి అమలాపురం పర్యటనలో ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు గుండా వెళ్తారని ఆ కారణం చూపుతూ ఆ రోడ్ నందు ఉన్నటువంటి పచ్చని చెట్లను పూర్తిస్థాయిలో విధ్వంసం చేస్తూ చెట్లు నరికి వేస్తున్న ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యాన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు. తక్షణమే చెట్లు నరకడం ఆపి పర్యావరణాన్ని కాపాడడానికి అధికారులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాజబాబుతో పాటు జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్ పార్టీ నాయకులు గండి స్వామి, అర్ల పల్లి దుర్గ తదితరులు చెట్లు నరికివేతపై ఆందోళన వ్యక్తం చేశారు.