అనసూరి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు, జనసైనికులు

పిఠాపురం: గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన అనసూరి కృష్ణ ఇటీవల మరణించారు. గురువారం స్వర్గీయ అనసూరి కృష్ణ స్వగృహానికి జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు చేబ్రోలు గ్రామ జనసైనికులతో కలిసి వెళ్ళి అనసూరి కృష్ణ భార్య వరలక్ష్మిని కలిసి కృష్ణ మరణం పట్ల ప్రగాఢసానుభూతిని తెలియజేసి. వారి కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. వారికి తగిన ఆర్థికసహాయం చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు దమ్ము చిన్నా, అల్లం దొరబాబు, గంటా గోపి, పోలవరపు శ్రీధర్, గంటి గంగ, శ్రీమతి లోకారెడ్డి‌ జ్యోతిబులి, వెంకన్నదోర, కొప్పిశెట్టి‌ అప్పారావు, మొగిలి శ్రీను, జ్యోతుల సీతరాంబాబు, మేడిబోయిన శ్రీను, సఖినాల రాంబాబు, కీర్తి చిన్నా, కొలా నాని తదితరులు ఉన్నారు.