సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన.. పాల్గొన్న జనసేన నాయకులు

అమలాపురం: అమలాపురం పురపాలక సంఘం 9వ వార్డులో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్ కు శంకుస్థాపన జరిగింది. 5లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించే సిసి రోడ్ కు పురపాలక చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, 9వార్డ్ జనసేన కౌన్సిలర్ గొలకొటి విజయలక్ష్మి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మట్ట పర్తి నాగేంద్రరావు, దొమ్మేటి రాము, గొవ్వాల రాజేష్ సంసాని చంద్ర శేఖర్, కట్టొజు సన్నాయి దాసు, బొర్రా వెంకటేశ్వరావు, గండి దేవి హారిక, తిక్కా సత్య లక్ష్మి, కో. ఆప్షన్ సభ్యులు వంకాయలకాశీ, రెడ్డి సత్యనారాయణ, గొలకొటి వాసు, తిక్కా ప్రసాద్, కమిషనర్ వి. అయ్యప్ప నాయుడు, డి.ఇ అప్పలరాజు, ఏ.ఇ హేమంత్, ఏ.ఇ భాస్కర్ తదితరులు పోల్గొన్నారు.