శ్రీకాళహస్తి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. వీర మహిళలు వినుత కోటాకి పుష్ప గుచ్చం ఇచ్చి, సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా మరియు వీర మహిళలకి, సమాజంలో గుర్తింపు పొందిన మహిళలకి, సామాన్య మహిళలకి శుభాకాంక్షలు తెలిపి, దుస్సాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా జనసేన శ్రేణులు మాట్లాడుతూ మహిళగా నియోజకవర్గంలో బలంగా ప్రజల కోసం పోరాడుతున్న వినుత కోటాని అభినందించారు. మహిళలకు నిజమైన సాధికారత జనసేన పార్టీతోనే సాధ్యమని తెలిపారు. మహిళలకి పెద్ద పీట వేసి వీర మహిళా విభాగంతో మహిళలకి 33% రిజర్వేషన్ అందించే దిశగా అడుగులు వేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ కి మహిళలు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.