వనపర్తిలోని ప్రభుత్వ ఎస్సీ కళాశాల హాస్టల్ ను సందర్శించిన జనసేన నాయకులు

వనపర్తి: జనసేన పార్టీ వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు ఆదేశాల మేరకు పట్టణంలోని పీర్లగుట్ట సమీపంలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ కళాశాల వసతి గృహన్ని సందర్శించి వారి సమస్యలను అక్కడి పరిస్థితులను జనసేన పార్టీ వనపర్తి జిల్లా నాయకులు తెలుసుకున్నారు. పట్టణంలోని ఎస్సీ ప్రభుత్వ కళశాల హాస్టల్ నందు గురువారం రోజున భోజనంలో గాజుల పెంకులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు గురి చెందారనీ, అదేవిధంగా నిరంతరం అన్నంలో పురుగులు రావడం, నాసిరకంగా వుండటం అట్టి విషయాన్ని జనసేన పార్టీ నాయకత్వం తెలుసుకొని ఆ మేరకు వసతి గృహం దగ్గరికి వెళ్లి వార్డెన్ విద్యావతి గారితో మాట్లాడడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ హాస్టల్స్ వుండే విద్యార్థులకు ఎలాంటి సమస్యా లేకుండా వసతి కల్పించాల్సిన భాధ్యత అక్కడి సిబ్బంది జాగ్రత్త పడాల్సిన అవసరం వుందని, ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా విద్యార్థినులకు భోజన సౌకర్యం అందించాలనీ ప్రభుత్వ హాస్టల్స్ లోనైన ఎక్కడైనా సరే విద్యార్థులు సమస్య వినపడితే వెంటెనే ప్రభుత్వ అధికారులు సందర్శిస్తూ సమస్యలు లేకుండా చూడాలని కోరారు. అక్కడి హాస్టల్ వార్డెన్ స్పందిస్తూ భోజన వంట చేసే సమయంలో పొరపాటున అలా జరిగిందనీ, ఆ అమ్మాయికి హాస్పిటల్ లో కూడా చూపించామని ఎలాంటి సమస్యా లేదని పేర్కొన్నారు. ఇలాంటి తప్పిదాలు జరగకుండా వారు కూడా హామీ ఇవ్వడం జరిగిందనీ గాజు పేంకు వచ్చిన అమ్మాయి ఆరోగ్య పరిస్థితిని కూడా కనుక్కోవడం జరిగింది. ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జనసేన పార్టీ జిల్లా నాయకులు ఉత్తేజ్, సురేష్ యాదవ్, హేమవర్ధన్, నితిన్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.