సాయి అఖిల్ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

హైదరాబాద్: జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలతో అమెరికాలో గన్ మిస్ ఫైర్ అయి చనిపోయిన సాయి అఖిల్ కుటుంబాన్ని మధిర పట్టణంలో పరామర్శించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని పార్థివ దేహాన్ని స్వదేశానికి తీసుకుని రావాలి అని, చేతికి వచ్చిన కొడుకు చనిపోవడంతో కుటుంబం ఆసరాని కోల్పోయింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలి అని జనసేన పార్టీ తరుపున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మిర్యాల జగన్మోహన్, మిరియాల రామకృష్ణ, జిల్లా నాయకులు తాళ్లూరి డేవిడ్, మెడబోయిన కార్తీక్, అజయ్ యాసంనేని, పుల్లారావు, మధిర నాయకులు భరత్, జానీ, బాజి పాల్గొన్నారు.