గొల్ల వీధి డ్రైనేజ్ సమస్యపై గళమెత్తిన జనసేన నాయకులు

  • 15వ వార్డ్, గొల్ల వీధి డ్రైనేజ్ సమస్యను గాలికి వదిలేసిన వైసీపీ నాయకులు
  • గడప గడపకు వచ్చి కాలువాలు వేయిస్తా అని మాటిచ్చి, మాట తప్పిన ఎమ్మెల్యే
  • కాలువలు కాదుకదా కనీసం పూడికలు అయినా తీయించండి అని ఆగ్రహం వ్యక్తం చేసిన వార్డ్ ప్రజలు
  • గొల్ల వీధి సందర్శించి యువత తో మాట్లాడి సమస్య తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: 15వ వార్డ్ డ్రైనేజ్ సమస్యను వైసీపీ నాయకులు గాలికి వదిలేసారని పార్వతీపురం జనసేన నాయకులు ఎద్దేవా చేసారు. శుక్రవారం 15వ వార్డ్ గొల్లవీధిని సందర్శించిన జనసేన నాయకులు
వార్డ్ సమస్యలపై గళమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్వతీపురం మున్సిపాలిటీ 15వ వార్డ్, గొల్ల వీధిలో నివసిస్తున్న సుమారు 70 కుటుంబాలు కొన్ని సంవత్సరాలుగా అక్కడ డ్రైనేజ్ సమస్యతో బాధ పడుతుతున్నారు. 15వ వార్డ్ కి కౌన్సిలర్ ఉన్నారు అని కూడా వారికి తెలియదు, ఏరోజు చూడలేదు అని కూడా వాపోతున్నారు.. ఎమ్మెల్యే అలజంగి జోగారావు కూడా గడప గడపకు కార్యక్రమంలో కూడా కాలువలు వేయిస్తాం అని మాటిచ్చి మాట తప్పారు అని వాపోయారు. పక్కనే ఉన్న హాస్పిటల్ కు సంబంధించి డ్రైనేజ్ కూడా ఈ కాలువలోనే కలుస్తుంది. వ్యర్థ పదార్థాలు, వాడిన సూదులు, సిరంజులు, బాటిల్స్ మరియు వాడి పడేసిన దూదులు అన్ని గొల్లవీధికి సంభందించిన కాలువలోనే పడవేయడంతో చిన్నపాటి వర్షం పడగానే ఆ వ్యర్ధాలు అన్ని ఇళ్ళ లోకి చేరడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కాలువల్లో పూడికలు తీసి కూడా చాలా రోజులు కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పూడికలు తియ్యాలి అని అలానే కాలువలు కూడా వేయించాలి అని డిమాండ్ చేసారు. ఈ 15వ వార్డ్ గొల్లవీధి సందర్శన కార్యక్రమంలో పార్వతీపురం జనసేన పార్టీ నాయకులు చందక అనీల్, రాజాన రాంబాబు, నెయ్యిగాపుల సురేష్, సిరిపురపు గౌరీ, మానెపల్లి ప్రవీణ్, కొల్లి వెంకట్ రావు సీతానగరం మండల అధ్యక్షులు పాటి శ్రీనివాస రావు మరియు 15వ వార్డ్ యువత పాల్గొన్నారు.