బొజ్జల సుధీర్ రెడ్డికి మద్దతును తెలిపిన జనసేన నాయకులు
శ్రీకాళహస్తి నియోజకవర్గం: జనసేన పార్టీ ఏర్పేడు మండలం, కమిటీ తీర్మానం మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన, బిజెపి, బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డినీ ఉగాది పర్వదినాన కలసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ తరపున సంపూర్ణ మద్దతును తెలుపుతూ కూటమి అభ్యర్థి గెలుపు కు కమిటీ అంతా పనిచేస్తుందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండలం అధ్యక్షులు దండి రాఘవయ్య, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ రామిశెట్టి, డివిజన్ అధ్యక్షులు పి వంశీకృష్ణ, బి. సురేంద్ర, శ్రీ ఓ జనార్థన్, మండల సెక్రటరీలు పవన్ కుమార్, శివ శంకర్, చలపతి చిందేపల్లి, గౌతం, సోషల్ మీడియా విభాగం ఇంచార్జి వంశీ, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-09-at-7.15.45-PM-1024x642.jpeg)