ప్రజా సమస్యలపై జనసేన మీడియా సమావేశం

తుని: తుని నియోజవర్గ ప్రజా మానిఫెస్టో రూపకల్పనలో భాగంగా కోటనందూరు మండలం, బొద్ధవరం గ్రామంలో అధికారంలోనికి వచ్చిన ప్రతి ప్రభుత్వం ఎన్నో ఏళ్లగా తాండవ నీటిపై బ్రిడ్జి నిర్మాణం చేస్తా అని చెప్పడమే కానీ కార్య రూపం లేదు. ఈ సమస్యతో పాటు స్మశానం సమస్యను గ్రామ ప్రజలు, జనసైనికులు కూడా జనసేన నాయకుల దృష్టికి తీసుకొని రావడంతో.. జనసైనికులు, మండల నాయకులు, గ్రామ ప్రజలు, గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకులు అందరి సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.