తెలంగాణా సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై జనసేన సమావేశం

హైదరాబాద్, తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 7 నుండి 14 అసెంబ్లీ స్థానాల్లో, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో కొండగట్టు నుంచి ప్రారంభం కానున్న యాత్ర మరియు పార్టీ కార్యాచరణపై జనసేన తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రామ్ తాళ్ళూరి, జి.హెచ్.ఎం.సి అధ్యక్షులు రాధారం రాజలింగం ఆధ్వర్యంలో జనసేన కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీరమహిళ విభాగం అధ్యక్షురాలు మండపాక కావ్య, యూత్ వింగ్ అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్, విద్యార్థి విభాగం అధ్యక్షులు సంపత్ నాయక్, ఆదిలాబాద్ ఇంచార్జి సైదల శ్రీనివాస్, వీరమహిళ విభాగం ప్రధాన కార్యదర్శి పొన్నూరు శిరీష, వైస్ ప్రెసిడెంట్ రత్న పిల్ల, ఆర్గనైజింగ్ సెక్రటరీ తాడికొండ లిఖిత, విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి మిరియాల రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గోకుల రవిందర్ రెడ్డి, యూత్ వింగ్ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, సెక్రెటరీ మూల హరీష్ గౌడ్, కత్తి సైదులు, రావుల మధులు పాల్గొన్నారు.