వనపర్తిలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

*ముఖ్యఅతిథి వంగ లక్ష్మణ్ గౌడ్

వనపర్తి జిల్లా, వనపర్తి నియోజకవర్గం.. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు మరియు వనపర్తి నియోజకవర్గ నాయకులు ఎమ్ రెడ్డి. రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా మరియు నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న సభ్యులకు క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్ హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు
బైరపోగు సాంబశివుడు, ఉమ్మడి జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు గోపాస్ కురుమయ్య, ఉమ్మడి జిల్లా యువజన విభాగం కార్య నిర్వహణ కార్యదర్శిలు రాజేందర్ సూర్య, జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ ఏదుల శరత్ కుమార్, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు జానీ, వనపర్తి జిల్లా నాయకులు కోడిగంటి సాయి, మూర్తి నాయక్, విజయ్, కాసిం, మాసూమ్, ముస్తఫా, శ్రీకాంత్, రాహుల్, సిద్ధార్థ, శ్రీధర్, శశి కుమార్, బి పవన్ కళ్యాణ్, రమేష్, శివకుమార్, శివ శంకర్, అరుణ్ కుమార్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.