మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుంది

  • అసిస్టెంట్ పబ్లిక్ పాసిక్యూటర్ దంపతులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి

అనంతపురం: మైనర్ బాలికకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో- ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత పేర్కొన్నారు. బాధిత బాలికను ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని 5వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల కాలంలో అనంతపురం అర్బన్ నియోజక వర్గంలో 14 సంవత్సరాల అభం శుభం తెలియని బాలికను అనంతపురం జిల్లా ఉరవకొండ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు నిర్వర్తిస్తున్న వసంతలక్ష్మి ఆమె భర్త వారి ఇంట్లో పని చేసేందుకు బాలికను పనికి కుదుర్చుకొని చిత్రహింసలకు గురిచేయాగా ఆ అమ్మాయి నవంబర్ 17వ తేదీన అస్వస్థతకు గురై ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత బాధిత బాలికను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వైద్య కర్చులకోసం 5వేల రూపాయలను ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీపీ దంపతుల దాడిలో గాయపడిన బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ ఇంకా కుదుట పడలేదని బాలికకు మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ న్యాయ వ్యవస్థలో విధులు నిర్వర్తిస్తు న్యాయాన్ని కాపాడవలసినది పోయి అన్యాయంగా ఈ విధంగా బాలికను చిత్రహింసలకు గురి చేసిన ఏపీపీ దంపతులకు కఠినమైన శిక్ష పడే విధంగ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నమన్నారు. అదేవిధంగా రాష్టానికి హోమ్ మంత్రిగా ఉన్న మహిళా మంత్రి తనేటి వనితకి, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మావతికి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఉషశ్రీకి అనంతపురంలో ఒక బాలికపై జరిగిన దాడి కనిపించడం లేదా కనిపించి ఉంటే దాడి చేసినవారికి కఠినమైన శిక్ష పడే విధంగా వ్యవహరించండని అన్నారు.