కూకట్ పల్లిలో ఘనంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం

కూకట్ పల్లి, 5వ ఫేస్ జనసేన పార్టీ కార్యాలయంలో మరియు కేబీహెచ్బీ కాలనీ 3వ ఫేస్ టెంపుల్ బస్ స్టాప్ లో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు సామాన్యుల కష్టాలను తీర్చటానికి పుట్టిన పార్టీ జనసేన పార్టీ అన్నారు. అనంతరం కేక్ కటింగ్, మొక్కల పంపిణీ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ జనసేన పార్టీ డివిజన్ నాయకులు, కోఆర్డినేటర్లు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.