పెడన నియోజకవర్గంలో జనసేన పార్టీ 2024 గెలుపే నా లక్ష్యం: ఎస్.వి.బాబు

పెడన, జోగి రమేష్ చెంచాలు, పెడన వైసీపీ పేటీఎం బ్యాచ్ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ గతంలో అనేకసార్లు మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురి చేయడం జరిగింది. గతంలో నా ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ నా పైన, నా వ్యక్తిగత జీవితంపై అసభ్యకర పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. తరువాత పోలీస్ వ్యవస్థను అడ్డంపెట్టుకుని సి.ఐ గారితో నన్ను అరెస్టు చేస్తానంటూ బెదిరించడం జరిగింది. సాక్షాత్తు జోగి రమేష్ ఆఫీస్ నుండి మంత్రి అనుచరులు రాత్రి సమయాల్లో నాకు ఫోన్ చేస్తూ బండ బూతులు తిట్టిన విషయం విధితమే.

పై విషయాలు ఇప్పుడు ప్రస్తావించుటకు కారణం
గత మూడు రోజులుగా వైసిపి పేటియం కార్మికులు నాపై పనిగట్టుకుని లేనిపోని ఆరోపణలు చేస్తున్న విషయాన్ని పాత్రికేయ మిత్రులకు, పెడన ప్రజలకు, మా జనసైనికులకు తెలియపరచవలసిన బాధ్యత నాకుంది. గత మూడు రోజులుగా వారు పెడుతున్న పోస్టులను చూస్తుంటే నేనంటే పెడన వైసిపి పేటియం బ్యాచ్ ఎంత భయపడుతున్నారొ అర్థమవుతుంది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల పెడన నియోజకవర్గంలో నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. సమయం వచ్చినప్పుడు సవివరంగా వివరిస్తాను. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి, జనసేనని, మా నాయకుడు పవన్ కళ్యాణ్ మీద అపారమైన విశ్వాసంతో కళ్యాణ్ తో కలిసి పయనిస్తున్నాం. నా లక్ష్యం ఒకటే నీతివంతమైన ప్రజా పాలన. నీతివంతమైన పాలన ప్రజలకు అందాలంటే సామాన్యుడు తన సమస్యను ధైర్యంగా చెప్పగలగాలి. నా లక్ష్యసాధనకు జనసేన సరైన పార్టీ అని నా మనసు కనిపించింది. జనసేన పార్టీలో నేను ఒక సామాన్య కార్యకర్తని, ఒక జనసైనికుడిని, అంతకుమించి నాకు ఎలాంటి పదవి అవసరం లేదు. ముఖ్యంగా పెడన నియోజవర్గ జనసేన పార్టీ ఇన్చార్జిగా ఎవరిని నియమించలేదు. పార్టీ ఎవరిని నియమిస్తే వారిని గౌరవిస్తూ, వారితో కలిసి నా శక్తికి మించి పనిచేయడానికి నేను సంసిద్ధం.

  • పెడన నియోజకవర్గంలో జనసేన పార్టీ 2024 గెలుపే నా లక్ష్యం

ప్రస్తుతం ఎలాంటి పదవి లేకుండా, భవిష్యత్తులో ఎలాంటి పదవి ఆశించకుండా ప్రజా సమస్యలపై, పెడన వైసీపీ నాయకులు చేస్తున్న అవినీతిపై పోరాడుతున్నాను… పోరాడుతూనే ఉంటాను. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో అంటకాగే అంట్లు ఎదవలు మీరు. మీకు నా వ్యక్తిత్వాని కించపరిచే నైతిక హక్కు ఉందా? అని పాత్రికేయ మిత్రుల సమక్షంలో అడుగుతున్నాను. ప్రశ్నకు ప్రతి ప్రశ్న సమాధానం కాదు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. లేకుంటే ఎవరు అధికారంలో ఉంటే వారికి భజన చేసుకుంటూ మీ బానిస బతుకులను కొనసాగించండి‌ అని పెడన జనసేన నాయకులు ఎస్.వి.బాబు అన్నారు.