వరకూటి ఆధ్వర్యంలో జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ సమావేశం

కనిగిరి నియోజకవర్గం: జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటి సభ్యులు, ఆరు మండల అధ్యక్షులతో కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరకూటి నాగరాజు ఆధ్వర్యంలో అన్ని అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో 18 సం.లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు చేర్చుకొనే విధంగా మన పార్టీ తరపున ప్రతి ఒక్కరిని చైతన్య పరచాలని కోరారు. అదే విధంగా ఎన్నికల కమిషన్ కొత్త ఓటు నమోదుకు ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువు పెంపు చేశారని తెలిపారు. ఆ తరువాత ఈ యాబై రోజుల్లో ప్రతి ఒక్క ఓటరు దగ్గరకి వెళ్లి ప్రతి ఒక్కరిని మన ఉమ్మడి కూటమి యొక్క మానిఫెస్టోను తెలియచేసి మన కనిగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్ధి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తదుపరి నియోజకవర్గంలో జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వారి సలహాలు సూచనలు తీసుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్య్రమానికి సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు మాధాసు రమేష్, జిల్లా కార్యదర్శి రహిముళ్ల, కనిగిరి నియోజకవర్గ మండల అధ్యక్షులు దర్శి ఏడుకొండలు, ఇండ్ల రమేశ్, ప్రవీణ్ కుమార్, ఆకుపాటి వెంకటరావు, నున్న శ్రీను మరియు జిల్లా ప్రోగ్రాం కమిటి మెంబర్ రామిశెట్టీ సునీల్ పాల్గొన్నారు.