ఓటరు లిస్టులో అవకతవకలపై జనసేన వినతి

కాకినాడ గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు లిస్టులో అనేక అవకతవకలు ఉన్నాయని, చనిపోయిన వ్యక్తుల పేర్లు, డబల్ ఎంట్రీలు, ట్రిబుల్ ఎంట్రీలు, ఫొటోస్ లేనివి, తొలగించకుండా ఓటరు లిస్టులో పొందుపరిచారని, ఈ అవకతవకలన్నీ ఎలక్ట్ట్రోల్ రెజస్టర్ ఆఫీసర్, కాకినాడ ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చినట్లు కాకినాడ రూరల్ జనసేన నాయకులు పంతం సందీప్ తెలిపారు. బుధవారం కాకినాడ ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సురేష్ కి జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు, కరప మండల అధ్యక్షులు బండారు మురళితో కలిసి జనసేన యువనాయకులు పంతం సందీప్ వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా పంతం సందీప్, కరెడ్ల గోవిందరాజులు, బండారు మురళి మీడియాతో మాట్లాడుతూ ఓటరు లిస్టులో అక్రమాలపై జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సూచనల మేరకు ఎలక్ట్ట్రోల్ రెజస్టర్ ఆఫీసర్, ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ సురేష్ కి వినతిపత్రం అందించడం జరిగిందని. వీటిపై వెంటనే బూత్ లెవెల్ అధికారులను నియమించి విచారణ చేయించాలని, ఎటువంటి తప్పులు జరగకుండా చూడాలని కోరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తాటికాయల వీరబాబు, జిల్లా నాయకులు సోదే ముసలయ్య, పాలేపు ఈశ్వర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.